Read Bible

Free to use • No login or registration required • For all ages

Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.

Genesis 36

1. ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి:

2. కనాను స్త్రీలలో నుండి ఏశావు తన భార్యలుగా చేసుకున్న వారు: హిత్తీయుడైన ఎలోను కుమార్తెయైన ఆదా, హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయైన ఒహోలీబామా,

3. అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు.

4. ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది.

5. ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు.

6. ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు.

7. వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు.

8. కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు.

9. శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి:

10. ఏశావు కుమారులు: ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు.

11. ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు.

12. ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.

13. రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.

14. ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు: యూషు, యాలాము, కోరహు.

15. ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు: ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు: నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు,

16. కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.

17. ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.

18. ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు: నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు.

19. వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు.

20. ఆ ప్రాంతంలో నివసిస్తున్న హోరీయుడైన శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

21. దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు.

22. లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.

23. శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము.

24. సిబ్యోను కుమారులు: అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి గాడిదలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్యంలో నీటి ఊటలను కనుగొన్నాడు.

25. అనా సంతానం: కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా.

26. దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.

27. ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను.

28. దిషాను కుమారులు: ఊజు, అరాను.

29. వీరు హోరీయుల నాయకులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

30. దిషోను ఏసెరు దిషాను. శేయీరులో వంశావళి ప్రకారం, వీరు హోరీయుల నాయకులు.

31. ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు:

32. బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది.

33. బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.

34. యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.

35. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.

36. హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.

37. శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.

38. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.

39. అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.

40. వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు: తిమ్నా, అల్వా, యతేతు,

41. ఒహోలీబామా, ఏలహు, పీనోను,

42. కనజు, తేమాను, మిబ్సారు,

43. మగ్దీయేలు, ఈరాము. వారు ఆక్రమించిన దేశంలో వారి వారి స్థావరాల ప్రకారం, వీరు ఎదోము నాయకులు. ఇది ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి.